తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం సులభం
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి స్థానికులకు సులభతరమైన మార్గంగా టిటిడి ప్రత్యేక టోకెన్ల పంపిణీని ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలోని కేంద్రాల ద్వారా ప్రతి నెల మొదటి మంగళవారం ప్రత్యేక దర్శనం కోసం మొదటి ఆదివారం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆధార్ కార్డుతో స్థానికులు టోకెన్లు పొందవచ్చు. ఒక దర్శనం తర్వాత 90 రోజుల తర్వాతే మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు.