బోర్డర్-గవాస్కర్ సిరీస్ ముందు భారత బ్యాట్స్‌మెన్‌ల ఆందోళనకర ప్రదర్శన!
ఆస్ట్రేలియాలో జరుగుతున్న భారత-ఆస్ట్రేలియా ‘ఏ’ జట్ల మధ్య అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందు భారత బ్యాట్స్‌మెన్‌లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న రెండవ అనధికారిక టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ల పతనం మరోసారి ప్రతికూల సంకేతాలను ఇస్తుంది.
అభిమన్యు ఈశ్వరన్ 0, కేఎల్ రాహుల్ 4, సాయి సుదర్శన్ 0, రుతురాజ్ గైక్వాడ్ 4 తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఈశ్వరన్ మైకేల్ నేసర్ బౌలింగ్‌లో డకౌట్ అయి, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందు అతని ఫామ్‌పై సందేహాలను రేకెత్తిస్తున్నాడు. దీనితో ఈశ్వరన్ ఈ టెస్ట్ సిరీస్‌లో వరుసగా మూడవ విఫలమయ్యాడు.
రాహుల్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విఫలమైన తర్వాత, మరోసారి కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరడంతో, అతని స్థానంపై మరింత ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నితీష్ రెడ్డి కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోయాడు. అతను కేవలం 16 పరుగులకే పెవిలియన్ చేరడంతో, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అవకాశం దక్కించుకోవడం కష్టమే అనిపిస్తుంది.
ధ్రువ్ జురెల్ మాత్రమే ఆశాజనకంగా ఆడుతున్నాడు. ఆతని హాఫ్ సెంచరీతో భారత ‘ఏ’ జట్టు స్కోరు కొంత స్థిరీకరించింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం జురెల్ మరియు రాహుల్‌ను ఆస్ట్రేలియాకు పంపారు. అయితే, బ్యాట్స్‌మెన్‌ల పతనం తర్వాత, ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు వెన్నెముకగా నిలవడం కష్టమనిపిస్తుంది.