నటి జత్వానీ కేసు: ఐపీఎస్ అధికారుల బెయిల్ పిటిషన్ వాయిదా

ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో తాత్కాలిక ఊపిరి పీల్చే అవకాశం లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్‌ అధికారులు తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ తర్వాత ఈ నెల 26వ తేదీ వరకు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ, 26వ తేదీ వరకు ఇంటీరియమ్‌ ఆర్డర్స్‌ను పొడిగించింది.

ఈ కేసులో నటి జత్వానీ గత ప్రభుత్వం తనను వేధింపులకు గురిచేసిందని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో, ఐపీఎస్‌ అధికారులు కాంతిరానా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లులపై కేసు నమోదు చేయబడింది. ఈ వ్యవహారంలో వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారనే అభియోగాలతో వారిని విధుల నుండి తొలగించారు.

ఈ కేసులో హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఐపీఎస్‌ అధికారులకు 26వ తేదీ వరకు ఊపిరి పీల్చే అవకాశం లభించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో విచారణ 26వ తేదీకి వాయిదా పడడంతో.. అప్పటి వరకు ఐపీఎస్‌లు, పోలీసు అధికారులకు ఊరట లభించినట్టు అయ్యింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *