వికారాబాద్ కలెక్టర్‌పై దాడి: ఉద్యోగుల తీవ్ర నిరసన!

వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు అధికారులపై దాడి జరిగిన తర్వాత, ఉద్యోగులు తమ నిరసనను వ్యక్తపరుస్తూ రెచ్చిపోయారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా అధికారులు గుమిగూడి, దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై జీవిత ఖైదు శిక్ష విధించాలని కోరుతూ నినాదాలు చేశారు.

పరిగి నియోజకవర్గంలోని తహశీల్దార్ కార్యాలయాలు మూసివేయబడ్డాయి. తహశీల్దారులు మరియు రెవెన్యూ సిబ్బంది కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని, కలెక్టర్ పై దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఉద్యోగ సంఘం నాయకులు, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుండి పెన్ డౌన్ ప్రకటించారు. ఉద్యోగుల నిరసన కారణంగా జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాలలో భూమి రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి.

లగచర్ల దాడి ఘటనలో కొడంగల్ కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ కారులో ఆసుపత్రికి తరలించబడిన ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *