సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం!

గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి పై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన మంగళవారం ఉదయం హైకోర్టును ఆశ్రయించారు. గుడివాడ ముబారక్ సెంటర్‌కు చెందిన వైసీపీ కార్యకర్త మహ్మద్ ఖాజాబాబా సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని గుడివాడ బాపూజీనగర్‌కు చెందిన శ్రీరాం కనకాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖాజాబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణలో, ఖాజాబాబా భార్గవ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పోస్టులు పెట్టానని వెల్లడించాడు. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొని, భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వినోద్ తదితరులను ఈ కేసులో నిందితులుగా పోలీసులు గుర్తించారు.

జూలై 1వ తేదీ తర్వాత బీఎన్‌ఎస్ యాక్ట్ అమల్లోకి వచ్చిందని, జూలైకు ముందు పెట్టిన ఈ కేసులో బీఎన్‌ఎస్ యాక్ట్ చెల్లదని వాదిస్తూ భార్గవ్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

మరోవైపు, పులివెందులలో పోలీసులు వైసీపీ సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి ఫిర్యాదు మేరకు ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఏపీ పోలీసులు వైసీపీ సైకో ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపుతున్నారు. సైబర్ నిపుణులతో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి, కూటమి ప్రభుత్వ పెద్దలు, మహిళా మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫేక్ ఐడీలతో పోస్టులు పెట్టినా గుర్తించి పట్టుకునే విధంగా సాంకేతికతను వియోగిస్తున్నారు.

జిల్లాలోని రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలకు చెందిన సోషల్ మీడియా గ్రూపులపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *