ప్రధాని మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి డొమినికా దేశం తన అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. కరోనా కాలంలో డొమినికాకు భారత్‌ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రధాని మోదీకి అందజేయనున్నట్లు డొమినికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

డొమినికా ప్రధాని కార్యాలయం, “2021 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ డొమినికాకు 70వేల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపించారు. ఆ అపురూప కానుక వల్ల మేం మా పొరుగు దేశాలకు అండగా నిలవగలిగాం. అంతేకాదు.. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆరోగ్యం, విద్య, ఐటీ రంగంలో భారత్‌ మాకు మద్దతు అందిస్తోంది. భారత్‌ మాకు గొప్ప భాగస్వామి. అందుకే ఆ దేశ ప్రధానిని మా అత్యున్నత పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించాం” అని తెలిపింది.

ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ విశేష కృషి చేశారని డొమినికా ప్రభుత్వం కొనియాడింది. వచ్చేవారం గయానాలో జరిగే ఇండియా-కరికోమ్ సదస్సులో ఈ అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేయనున్నారు. నవంబరు 19 నుంచి 21 వరకు ఈ సదస్సు జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *