కంగువ కంగారు పుట్టిస్తోంది! పుష్ప 2 సంగీతం ఎలా ఉంటుంది?
పుష్ప 2 విడుదలకు ఇంకా 20 రోజులు మాత్రమే ఉన్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. కానీ 20 రోజుల ముందు దేవి శ్రీ ప్రసాద్ తన తాజా సినిమా “కంగువ” తో సందడి చేశాడు. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదని అభిమానులు నిరుత్సాహ పడ్డారు. సోషల్ మీడియాలో కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పాటల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కృత్రిమంగా పెంచడమే కారణమని విమర్శిస్తున్నారు. “కంగువ” సినిమా ఫలితం చూస్తుంటే దేవిశ్రీప్రసాద్ “పుష్ప 2” కు ఎలాంటి సంగీతం అందిస్తారో అనే అనుమానాలు మొదలవుతున్నాయి.
“పుష్ప 2” విషయానికి వస్తే, దేవి శ్రీ ప్రసాద్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒక సంగీత దర్శకుడు ప్రతి సినిమాకు వేర్వేరు రకాల సంగీతం అందిస్తాడు. “కంగువ” ఒక పీరియాడిక్ సినిమా కావడంతో దానికి అవసరమైన సంగీతం ఇచ్చాడు. అదే “పుష్ప 2” అనేది ఎలివేషన్స్ తో కూడిన సినిమా కాబట్టి వేరేలా సంగీతం అందిస్తాడు. అంతేకాకుండా, “పుష్ప 2” కు ఎస్ ఎస్ తమన్ తో పాటు మరో సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ మీద పని చేస్తున్నారు. దీని వల్ల “పుష్ప 2” కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం పూర్తిగా ఆధారం కాకపోవచ్చు.