ప్రేమలో హగ్, కిస్ నేరం కాదని మద్రాస్ హైకోర్టు తీర్పు
మద్రాస్ హైకోర్టు తాజాగా వివాదాస్పద తీర్పును వెలువరించింది. ఇద్దరు ప్రేమికుల మధ్య హగ్, కిస్ లను లైంగిక నేరాలుగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
21 ఏళ్ల యువకుడిపై 19 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. ఆమె తనను ముద్దు పెట్టుకున్నాడని, హగ్ చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై కేసు నమోదు చేయబడింది. ఈ కేసు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ముందుకు వెళ్లింది.
ధర్మాసనం తన తీర్పులో ప్రేమలో ఉన్నప్పుడు హగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం సహజమని పేర్కొంది. ఇలాంటి చర్యలను ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) కింద నేరాలుగా పరిగణించడం సరైనది కాదని ధర్మాసనం పేర్కొంది.
కోర్టు తన తీర్పులో “ప్రేమించుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకోవడం, లైంగికంగా మోసం చేయడం” వంటివి మాత్రమే చట్ట ప్రకారం నేరంగా పరిగణిస్తారని చెప్పింది. ఇద్దరూ ఏకాభిప్రాయంతో సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత తగాదాలు వచ్చి విడిపోయిన తర్వాత ఒకరిపై మరొకరు కేసులు వేయడం సరి కాదని కోర్టు స్పష్టం చేసింది.