మిర్జాపూర్‌లో బీజేపీ ఎంపీ విందులో మటన్ కలకలం

ఉత్తర్ ప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో బీజేపీ ఎంపీ వినోద్ బింద్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం మటన్ ముక్కల లేమితో గొడవకు దారితీసింది. నవంబర్ 14 న జరిగిన ఈ విందులో వెయ్యి మందికి పైగా ఆహ్వానించారు, హాజరైన వారికి గ్రేవీ మాత్రమే వడ్డించడంతో ఉద్రిక్తత మొదలైంది. మటన్ ముక్కలు లేకుండా గ్రేవీని మాత్రమే వడ్డించడంపై అతిథులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విందులో మటన్ ముక్కలు లేకపోవడం తీవ్రమైన వివాదంగా మారింది. ఎంపీ సోదరుడు కేవలం గ్రేవీ మాత్రమే పంపించినట్లు సమాచారం వచ్చిన తర్వాత, అతిథులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *