ఉత్తమ్, ఆదిశ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
కోదాడలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీల వర్గీకరణ కొనసాగుతుందని ఉత్తమ్ తెలిపారు. రైతు రుణమాఫీకి 2700 కోట్లు ఖర్చు చేశామని, అయినా 850 కోట్ల వడ్డీ భారం రైతులపై పడిందని వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 1700 కోట్లు సంపాదించిందని, పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని ఆరోపించారు. మరోవైపు, కాళేశ్వరరావు ఇప్పుడు కూలేశ్వరరావుగా మారారని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆదిశ్రీనివాస్ ప్రకటించారు. 40 లక్షల మంది రైతులు 153 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించారని, కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు, అనేక పరిశ్రమలు నిర్మిస్తున్నామని, ఈ నెల నుండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.