చేవెళ్ళలో ఘోర రోడ్డు ప్రమాదం
చేవెళ్ళ పట్టణంలోని ఆలూరు గేటు వద్ద శనివారం సాయంత్రం ఒక భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన లారీ పక్కదారి పట్టి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వారిపై దూసుకెళ్ళింది. ఈ ఘోర ప్రమాదంలో పది మందికి పైగా మరణించగా, ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అతనికి రెండు కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.