“అన్‌స్టాపబుల్” షోలో అల్లు అర్జున్ – బాలయ్య సందడి!
“అన్‌స్టాపబుల్” షోలో బాలయ్య గారితో సందడి చేసిన అల్లు అర్జున్, సినిమా రంగం గురించి, తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ, “అప్పటికి, ఇప్పటికి ఆరడుగుల బంగారం అనిపిస్తుంది” అని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి, “తన దారిలో తను వెళ్లిపోతారు” అని బాలయ్య అనగా, “అంతే” అని బన్నీ బదులిచ్చారు. తెలుగు వారికి జాతీయ అవార్డు రాకపోవడం విషాదమని, ఎలాగైనా సాధించాలనుకున్నానని బన్నీ తెలిపారు. అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే కోపం వస్తుందని, కానీ ఎక్కడా బయటపెట్టలేదని చెప్పారు.
చిన్నతనంలో అల్లు అర్జున్ ఏవిధంగా ఉండేవాడు, చేసిన అల్లరి పనులు వంటి విషయాలు తల్లి నిర్మల షోలో గుర్తుచేసుకున్నారు. ప్రభాస్ – అల్లు అర్జున్ మధ్య ఎంతోకాలం నుంచి ఉన్న స్నేహబంధం గురించి మాట్లాడారు.
“పుష్ప 2” డిసెంబర్ 5న విడుదల కానుంది. “పుష్ప ది రైజ్”కు కొనసాగింపుగా ఇది సిద్ధమవుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.