అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో: కొత్త అధ్యాయం ప్రారంభం!

“పుష్ప 2” సందడి అవ్వకముందే, అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించాడు. ఆ ప్రాజెక్ట్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి రానున్న సినిమా. ఇప్పటికే ఈ కాంబో గురించి ఎన్నో ఊహలు, అంచనాలు వినిపిస్తున్నాయి.

నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, హారిక హాసిని బ్యానర్ పైనే తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను జనవరిలో విడుదల చేయనున్నారని సమాచారం.

త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఎలా చిత్రీకరించనున్నారో, అందులో అల్లు అర్జున్ ఎలా కనిపించనున్నారో అనేది ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన లుక్‌కు అల్లు అర్జున్ కొంత సమయం కేటాయించాలి.

అందుకే మార్చిలో ప్రారంభం అనుకున్న ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జులైలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా దేశంలో ఇంతకు ముందు ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుందని, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని కూడా వినిపిస్తోంది.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో సినిమాపై టాలీవుడ్‌లో ఊహాగానాల వర్షం కురుస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉంది, కానీ ట్రేడ్ సర్కిల్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *