అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సెల్లర్లపై ED దాడులు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో నమోదైన విక్రేతలపై దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలే ఈ దాడులకు కారణం. దిల్లీ, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, బెంగళూరు వంటి పెద్ద నగరాలలోని 19 విక్రేతలకు చెందిన ప్రదేశాలపై ఈ దాడులు జరుగుతున్నాయి.

ఈ సోదాలకు కారణంగా, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో నమోదైన విక్రేతలు FEMA నిబంధనలను ఉల్లంఘించి లావాదేవీలు నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. పోటీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ రెండు సంస్థలు తమ విక్రేతల ద్వారా అమ్మకాలు జరుపుతున్నారని కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) విచారణలో తేలింది. ‘రాయిటర్స్‌’ వార్తా సంస్థ తన కథనంలో, ఈ ప్లాట్‌ఫామ్‌లలో సెర్చ్‌ రిజల్ట్‌లో కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రదర్శించేలా వారి ఎకో సిస్టమ్‌ను రూపొందించారని  సూచిస్తూ సీసీఐ నివేదికను రాసింది. ఈ నేపథ్యంలో ఈ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *