అమీర్ ఖాన్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా!
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు పెట్టింది పేరు మైత్రి మూవీస్. పుష్ప -2, ప్రభాస్ హను రాఘవ పూడి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వంటి పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న మైత్రి, ఇప్పుడు తమిళ హీరో అజిత్ హీరోగా ‘గుడ్ బాడ్ అగ్లీ’ సినిమాను నిర్మిస్తోంది.
మైత్రి తమ పరిధిని మరింత విస్తరించుకుంటూ సౌత్ నార్త్ కాంబినేషన్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ కోవలోనే, బాలీవుడ్ ఖాన్‌లో ఒకరైన అమీర్ ఖాన్, తమిళ బ్లాక్ బస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కథా చర్చలు పూర్తయ్యాయి మరియు అమీర్ ఖాన్ లోకేష్ కథకు మెచ్చుకున్నారు.
మైత్రి ఇప్పటికే సన్నీ దియోల్‌తో ఒక సినిమాను నిర్మిస్తున్నారు, ఇప్పుడు అమీర్ ఖాన్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా రికార్డులను బద్దలు కొట్టబోతోంది. ఇదిలా ఉంటే, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే.