ఏపీ అసెంబ్లీ, శాసనమండలి: బడ్జెట్ సమావేశాల ప్రారంభం

బుధవారం ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. తర్వాత ప్రభుత్వం మూడు సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు- 2024ను ప్రవేశపెట్టనుండగా, మంత్రి నారాయణ ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు- 2024 ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు-2024 ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు…చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధికుక్కల బెడద, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రోరైల్ నిర్మాణం, ఇరిగేషన్ కాలువల అధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, డిఎస్సీ-1998.. తదితర అంశాలపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల తర్వాత, 2024-25 ఆర్థిక బడ్జెట్పై చర్చ జరుగుతుంది.

బుధవారం ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. ఫ్రీ హోల్డ్ భూములు క్రమబద్దికరణ, కైకలూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మత్తులు, 2019-24 వరకు మద్యం అమ్మకాలలో జరిగిన అక్రమాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పంట రుణాలపై అధిక వడ్డీ, విజయనగరంలో ఆతిసారం, పిడిఎస్ బియ్యం అక్రమాలు, ఉచితపంటల భీమా పథకం, పంచాయితీ భవనాలకు రంగులు, పాఠశాల బస్సులకు పన్ను తదితర అంశాలపై చర్చ జరగనుంది. అనంతరం, 2024-25 ఆర్థిక బడ్జెట్పై చర్చ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *