ఏపీ బడ్జెట్‌పై ఎమ్మెల్యేలకు అవగాహన సమావేశం!

ఏపీ అసెంబ్లీలో సోమవారం రూ. 2.94 లక్షల కోట్లతో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌పై అవగాహన కల్పించేందుకు, మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలకు వివరణాత్మక సమావేశం జరిగింది.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై అవగాహన కల్పించడమే కాకుండా, అసెంబ్లీ కార్యక్రమాలను వివరించే బాధ్యతను స్పీకర్ మరియు ఇతర సీనియర్ నేతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ ఎజెండా, ఇతర అంశాలపై ఎన్డీఏ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు.

మరోవైపు, మధ్యాహ్నం 2 గంటలకు కూటమి నేతలు సమావేశమై, ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ఖరారు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *