ఖమ్మంలో హైటెక్ మోసం: ఏటీఎం ట్యాంపరింగ్‌తో లక్షల రూపాయలు దోపిడి

ఖమ్మం జిల్లాలోని ఎన్‌ఎస్‌టీ రోడ్డు సమీపంలోని కవిత కాలేజీ వద్ద ఉన్న హెచ్‌డిఎఫ్‌సి ఏటీఎం వద్ద మోసం జరిగింది. ఒక మహిళ మరియు ఇద్దరు వ్యక్తులు కలిసి ఎంతోకాలంగా నగదు బదిలీ చేయించుకుంటున్న విషయం బయటపడింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి ముంబై నుండి కాల్ చేశారు. ఏటీఎం నిర్వాహకులు వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించగా, ఒక షాకింగ్ నిజం బయటపడింది. కొందరు ఏటీఎంను ట్యాంపరింగ్ చేసి నగదు దొంగతనం చేస్తున్నట్లు తెలిసింది.

నగదు దొంగతనం చేసిన విషయం తెలుసుకున్న నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ బీహార్‌కు చెందిన ప్రియాంక సింగ్ అని గుర్తించారు. మహిళ వద్ద రెండు ఆధార్ కార్డులు మరియు రెండు పాన్ కార్డులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

పోలీసుల విచారణ ప్రకారం, మహిళ బ్యాంకు నిర్వాహకులను మోసం చేయడానికి వేషం మార్చుకుని ఎంతోకాలంగా అనుమానపు చిక్కుముడులను ఏర్పాటు చేసింది. ప్రియాంక సింగ్‌కు సహాయం చేసిన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు.

ఏటీఎం నగదు చెల్లింపు విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎప్పటి నుండి ఈ నగదు బదిలీ జరుగుతోందనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *