కైలాస పర్వతం: మానవాళికి అందుబాటులో లేని శిఖరం

కైలాస పర్వతం హిందూ మతంలో పవిత్రమైనదిగా భావించబడుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ నివసిస్తున్నారని నమ్ముతారు. ఎవరెస్ట్ కన్నా 2000 మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ, ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. పర్వతంపైకి ఎక్కేందుకు ప్రయత్నించిన వారందరికీ భయంకరమైన అనుభవాలు ఎదురైయ్యాయి. కైలాస పర్వతం అసలు రహస్యం ఇప్పటికీ అగమ్యంగానే ఉంది.

ధోని మ్యాజిక్: ఖాతాబుక్‌తో మరో విజయం!

మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రెటైర్ అయిన తర్వాత కూడా తన వ్యాపార వ్యవహారాల ద్వారా జనాదరణ సంపాదిస్తున్నాడు. ధోని పెట్టుబడి పెట్టిన ‘ఖాతాబుక్’ అనే స్టార్టప్ కంపెనీ తక్కువ కాలంలోనే వేల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది.

రుషికొండ ప్యాలెస్: అనుమతుల ఫైళ్లు మాయం, ప్రజాధనం దుర్వినియోగమా?

రుషికొండలో నిర్మించిన ప్యాలెస్ నిర్మాణంలో అనుమతుల ఫైళ్లు, రిసార్టులోని విలువైన సామగ్రి గల్లంతవడం వల్ల వివాదాలు తలెత్తుతున్నాయి. అధికారుల తూతూమంత్రంగా వ్యవహరించడం, అనుమతులకు సంబంధించిన ఫైళ్లు మాయమవడం ప్రజాధనం దుర్వినియోగంపై ఎన్నో సందేహాలు ఉత్పన్నమవుతున్నయి. 

రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా : పవన్‌ కల్యాణ్‌ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ మాఫియా పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్‌, గంజాయి కట్టడికి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది.

ముంబై నటిపై వేధింపులు: కుక్కల విద్యాసాగర్ బెయిల్ విచారణ

విజయవాడలో, నటి కాదంబరీ జెత్వానిపై వేధింపుల కేసులో వైసీపీ నేత విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ సీఐడీ కోర్టులో విచారణకు వచ్చింది. కోర్టు వాదనలు విన్నాక విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. విద్యాసాగర్ ఈ కేసులో A1 నిందితుడు, అతడికి మూడు రోజుల పోలీసు కస్టడీ అనుమతి లభించింది. జెత్వాని తనపై తప్పుడు కేసు పెట్టి, తల్లిదండ్రులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించింది. ఈ కేసులో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు, వీరు సస్పెండ్ అయ్యారు.

రష్యా – భారత్ సంబంధాలు: ఒక అద్భుతమైన అధ్యాయం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, భారతదేశాన్ని తన దేశానికి సహజ భాగస్వామిగా అభివర్ణించి, రెండు దేశాల మధ్య సంబంధాలు అన్ని రంగాలలోనూ అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాయని పేర్కొన్నారు. భద్రత, రక్షణ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో రెండు దేశాలు సహకారం పెంచుకుంటున్నాయని, బ్రహ్మోస్‌ ఉమ్మడి కార్యక్రమం ఈ సహకారానికి నిదర్శనమని తెలిపారు.

దొంగతనాలకు చెక్: ఏలూరు పోలీసులకు చంద్రబాబు ప్రశంసలు

ఏలూరు పోలీసులు 251 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, 25 మంది అనుమానితులను అరెస్టు చేసిన విషయాన్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. దొంగతనాల కేసులను పరిష్కరించడంలో పోలీసులు ప్రదర్శించిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కేసులను ఛేదించడానికి ఉపయోగించిన … Read More

హైదరాబాద్-శ్రీశైలం హైవే విస్తరణకు చర్యలు!

హైదరాబాద్-శ్రీశైలం రహదారి రద్దీ తగ్గించేందుకు 2 లేన్ల రోడ్డును 4 లేన్లుగా విస్తరించనున్నారు, ఇందులో 147.31 హెక్టార్ల అటవీ భూమి అవసరం. ప్రాజెక్టు నల్లమల అడవి, అమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళుతుండటంతో, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా 45.42 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మించనున్నారు. అటవీశాఖ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు వాహనాలను ఆపడం, మరియు తక్కువ లైటింగ్ వంటి షరతులు విధించింది. ప్రాజెక్టు ఆమోదం కోసం అధికారులు చర్చలు కొనసాగిస్తున్నారు.

పామాయిల్ రైతులకు పుష్కలంగా లాభాలు: ఏపీ ప్రభుత్వం చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో పామాయిల్ రైతులకు స్థిరమైన ధరలు లభించేలా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, పామాయిల్ రైతులు, కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్‌ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా … Read More

హైదరాబాద్‌లో అతిపెద్ద రైల్వేస్టేషన్: చర్లపల్లి రైల్వే స్టేషన్‌

హైదరాబాద్‌ నగరం చాలా కాలంగా కోరుకుంటున్న ఒక పెద్ద మార్పు ఇప్పుడు జరగబోతోంది. చర్లపల్లిలో నిర్మించబడిన అత్యధునిక రైల్వే స్టేషన్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత నగరంలో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా ఈ స్టేషన్‌ అవతరిస్తోంది. … Read More