తిరుపతికి కేంద్రపాలిత హోదా: సుప్రీంకోర్టులో పిటిషన్
తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల దేవస్థానం నిర్వహణ పూజారుల చేతుల్లో ఉండాలని, దేవాలయాలలో రాజకీయ జోక్యం ఉండకూడదని పాల్ కోరారు. తిరుమల లడ్డూల నాణ్యతపై తలెత్తిన వివాదంపై కూడా ఆయన సీబీఐ విచారణ కోరారు.