అమెరికా-భారత్ బంధం ట్రంప్ హయాంలో మరింత బలపడే అవకాశం: పీయూష్
ట్రంప్ ప్రభుత్వంతో భారత్‌కు మరింత బలమైన సంబంధాలు ఏర్పడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధాని మోదీకి, ట్రంప్ మధ్య ఉన్న సాన్నిహిత్యం దీనికి కారణమని పీయూష్ చెప్పారు. ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని పీయూష్ అభిప్రాయపడ్డారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ట్రంప్ కీలక బాధ్యతలు కట్ట్టబెట్టడంపై సంతోషం వ్యక్తంచేశారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని స్వాగతిస్తూ, వినియోగాన్ని పెంచేందుకు రేట్లు తగ్గించాలని పరిశ్రమ, వ్యాపారవర్గాలను పీయూష్ గోయల్ కోరారు.