“శ్యామ్ సింగరాయ్” షూటింగ్ సమయంలో సాయి పల్లవి కన్నీరు!

సాయి పల్లవి “శ్యామ్ సింగరాయ్” షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడారు. రాత్రి పూట షూటింగ్‌లు, బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆమెకు అలసట, నిద్రలేమి ఎదురయ్యాయి. ఒకరోజు ఆమె చెల్లితో బాధపడుతూ ఏడ్చిన తర్వాత, నిర్మాత వెంకట్‌ బోయనపల్లి ఆమెకు పది రోజుల సెలవు ఇచ్చారు.

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్, చాందిని నిశ్చితార్థం!

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ మరియు నటి చాందిని రావు వివాహం డిసెంబర్ 7న తిరుపతిలో జరగనుంది. వీరి నిశ్చితార్థం సోమవారం విశాఖపట్నంలో గ్రాండ్‌గా జరిగింది. ‘కలర్‌ ఫొటో’ చిత్రీకరణ సమయంలోనే వీరి ప్రేమాయనం మొదలయింది.

ఆలయ ప్రదక్షిణలో విషాదం!

కార్తీక మాసం ఉదయం హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా విష్ణువర్ధన్ అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి, హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడు.

హైదరాబాద్‌లో నిషేధాజ్ఞల సడలింపు: కొత్త ఆదేశాలు!

హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు సడలిపోయాయి. సచివాలయం పరిసరాల్లో మాత్రమే ఆంక్షలు కొనసాగుతాయి. నిరసనలు ధర్నా చౌక్‌లో అనుమతితో మాత్రమే. పోలీసు అనుమతి లేని నిరసనలకు చర్యలు తీసుకుంటారు.

శివకటాక్షానికి వేదిక: కోటి దీపోత్సవం

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో జరుగుతున్న “కోటి దీపోత్సవం” మూడవ రోజు కార్తిక సోమవారం నాడు కొనసాగుతోంది. భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ, శ్రీ శివానంద భారతి స్వామీజీ గారిచే అనుగ్రహ భాషణం ఉండగా, శ్రీ బంగారయ్య శర్మ గారు ప్రవచనామృతం చేయనున్నారు. వేదికపై శివపరివారానికి కోటి బిల్వార్చన, భక్తులచే శివలింగాలకు కోటి బిల్వార్చన, ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ ఉంటుంది.

రాగుల ఆరోగ్య ప్రయోజనాలు!

రాగులు ఎముకుల బలాన్ని పెంచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. గ్లూటెన్ రహిత ధాన్యం అయిన రాగులను వారంలో కనీసం రెండు రోజులైనా ఆహారంలో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

ట్రంప్-పుతిన్ ఫోన్ కాల్: నిజమేనా?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్ ద్వారా సంభాషించారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌కు ట్రంప్ సూచించారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, రష్యా ఈ వార్తలను కొట్టిపారేసింది. ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.

బస్సు దొంగతనం: ఒడిశాలో షాకింగ్ ఘటన!

ఒడిశాలోని గంజాం జిల్లాలో డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు దొంగతనం జరిగింది. దొంగలు బస్సును దొంగలిస్తున్న దృశ్యం సీసీటీవీలో చిక్కింది. పోలీసులు బస్సును స్వాధీనం చేసుకున్నప్పటికీ, దొంగలు ఇంకా పట్టుబడలేదు.

సైబర్ నేరగాళ్ళ కొత్త డ్రామా: పోలీసుల పేరుతో భయపెడుతున్నారు

హైదరాబాద్‌లోని సైబర్‌ నేరగాళ్ళు సీపీ సీవీ ఆనంద్‌ పేరుతో వాట్సాప్‌ ద్వారా కాల్స్‌ చేసి ప్రజలను భయపెడుతున్నారు. ఈ కాల్స్‌ పాకిస్థాన్‌ నుండి వస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకుండా ఉండాలని సీపీ సూచించారు.

తెలంగాణ నేతల ఎన్నికల ప్రచారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ముంబై వెళుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జార్ఖండ్‌కు వెళ్లి అక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.