విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పోస్ట్ కార్డ్ ఉద్యమం!
విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పోరాటం 1300 రోజులకు చేరింది. ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, కార్మికుల ఆందోళన పెరుగుతోంది. ‘ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ’ ప్రైవేటీకరణను నిరసిస్తూ, 10 లక్షల పోస్ట్ కార్డులను ప్రధానికి పంపే ఉద్యమాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 10న ఆర్కే బీచ్‌లో ర్యాలీ నిర్వహించి, 2.5 లక్షల పోస్ట్ కార్డులను ప్రధాన పోస్ట్ ఆఫీస్‌కి తరలించనున్నారు.