‘భైరవం’ లో నారా రోహిత్ లుక్ కు మంచు మనోజ్ రియాక్షన్
తమిళ హిట్ సినిమా ‘గరుడన్’ తెలుగు రీమేక్ ‘భైరవం’ చిత్రం మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయి అద్భుత స్పందనను సాధించింది. తాజాగా బుధవారం నారా రోహిత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో నారా రోహిత్ ‘వరదా’ పాత్రలో కనిపించనున్నాడు. సరికొత్త లుక్ లో నెరసిన జుట్టు, గెడ్డంతో నారా రోహిత్ పవర్ఫుల్ గా కనిపించాడు. ఇప్పటికే విడుదలైన రెండు పోస్టర్స్ లోను యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉండేలా డిజైన్ చేశారు.
నారా రోహిత్ లుక్ పై ‘భైరవం’ లో మరో పాత్రలో కనిపిస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నారా రోహిత్ ను ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేస్తూ ‘ఎవడు తగ్గట్లేదుగా, మాస్ హీరోలందరూ లుక్స్ తో అదరగొడుతున్నారు. న్యూ మేకోవర్ దుమ్ములేచిపోయింది బాబాయ్’ అని కామెంట్స్ చేశారు.
అన్నట్టు, ‘భైరవం’ లోని మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు. భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. హరి కె.వేదాంతం ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.