అగ్నిగోళంగా మారిన కాలిఫోర్నియా: లాస్ ఏంజెలెస్‌కు ప్రమాదం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి ఇంకా తగ్గకముందే, కాలిఫోర్నియా రాష్ట్రాన్ని అగ్నిదేవుడు చుట్టుముట్టాడు. గాలి వేగానికి మంటలు పరుగు పెడుతున్నాయి. లాస్ ఏంజెలెస్ పరిసర ప్రాంతాలను మంటలు ఆవహించి, దాదాపు 10,000 మందిని ఇళ్లు వదిలి వెళ్లేలా చేశాయి. వేల సంఖ్యలో ఇళ్ళు, భవనాలు మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉండటంతో, అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మంటల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, ప్రజలు అంధకారంలో కూరుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, మంటలు ఆర్పడం కష్టంగా ఉంది.
“కాలిఫోర్నియా: భయపడ్డది” అని “The Hotshot Wake Up” ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని అనేక ప్రాంతాలలో మంటలు వ్యాపించడం వల్ల, ఆ ప్రాంతం పొగమయంగా మారిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలు కనిపించకుండా పోవడంతో ప్రజలను తరలించడం మరియు మంటలను ఆర్పడం కష్టంగా మారింది.
కేవలం 5 గంటల వ్యవధిలోనే, మొదట 1 కిలోమీటర్ విస్తీర్ణంలో మొదలైన మంటలు 60 కిలోమీటర్లకు పైగా వ్యాపించాయి. వెంచురా కౌంటీ అధికారులు ప్రజలను వెంటనే తమ ప్రాంతాలను ఖాళీ చేయమని కోరుతున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
“కాలిఫోర్నియా రాష్ట్రం” అని “Dada Shastoni” ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.