కాల్ డ్రాప్స్‌కు చెక్: కేంద్రం కొత్త చర్యలు!
కాల్ డ్రాప్స్ అంటే ఎంతో ముఖ్యమైన కాల్ చేస్తుండగా, మధ్యలోనే కట్ అయిపోవడం, నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉండటం వంటి సమస్యలతో మనం పోరాడుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర టెలికాం శాఖ ముందుకు వచ్చింది!
2025 ఏప్రిల్ నుండి ప్రతి నెలా కాల్ డ్రాప్స్ పరిస్థితిని సమీక్షించనున్నట్లు శాఖ ప్రకటించింది. గతంలో మూడు నెలలకోసారి జరిగే ఈ సమీక్షను తరచుగా చేయడం ద్వారా, సమస్యను త్వరగా గుర్తించి, పరిష్కరించడం సాధ్యమవుతుంది. అంతేకాదు, కాల్ క్వాలిటీ చెక్ కూడా మరింత సమర్థవంతంగా చేయనున్నారు. టవర్ వద్ద కాకుండా, స్మార్ట్‌ఫోన్ వద్దే కాల్ క్వాలిటీని పరీక్షించేలా చర్యలు తీసుకోబోతున్నారు.
ఇదంతా కాకుండా, దేశవ్యాప్తంగా 26 వేల గ్రామాలకు సేవలు అందించేలా 27 వేల టవర్లను నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ టవర్ల నిర్మాణం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నెట్‌వర్క్ కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు, కాల్ డ్రాప్స్ సమస్య కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
మరోవైపు, ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాల కట్టడికి కేంద్రం తన వంతు కృషి చేస్తోంది. ఈ మోసాలను అరికట్టడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ)ను ఏర్పాటు చేసింది.