శబరిమలలో వర్షాల తాండవం

ఫెంగల్ తుఫాను ప్రభావంతో కేరళలోని శబరిమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంబా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. నదులు, అడవుల్లోకి ప్రవేశం నిషేధించారు. వర్షాలు తగ్గే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. డిసెంబర్ 4 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం సులభం

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి స్థానికులకు సులభతరమైన మార్గంగా టిటిడి ప్రత్యేక టోకెన్ల పంపిణీని ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలోని కేంద్రాల ద్వారా ప్రతి నెల మొదటి మంగళవారం ప్రత్యేక దర్శనం కోసం మొదటి ఆదివారం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆధార్ కార్డుతో స్థానికులు టోకెన్లు పొందవచ్చు. ఒక దర్శనం తర్వాత 90 రోజుల తర్వాతే మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు.

శివకటాక్షానికి వేదిక: కోటి దీపోత్సవం

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో జరుగుతున్న “కోటి దీపోత్సవం” మూడవ రోజు కార్తిక సోమవారం నాడు కొనసాగుతోంది. భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ, శ్రీ శివానంద భారతి స్వామీజీ గారిచే అనుగ్రహ భాషణం ఉండగా, శ్రీ బంగారయ్య శర్మ గారు ప్రవచనామృతం చేయనున్నారు. వేదికపై శివపరివారానికి కోటి బిల్వార్చన, భక్తులచే శివలింగాలకు కోటి బిల్వార్చన, ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ ఉంటుంది.

కైలాస పర్వతం: మానవాళికి అందుబాటులో లేని శిఖరం

కైలాస పర్వతం హిందూ మతంలో పవిత్రమైనదిగా భావించబడుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ నివసిస్తున్నారని నమ్ముతారు. ఎవరెస్ట్ కన్నా 2000 మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ, ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. పర్వతంపైకి ఎక్కేందుకు ప్రయత్నించిన వారందరికీ భయంకరమైన అనుభవాలు ఎదురైయ్యాయి. కైలాస పర్వతం అసలు రహస్యం ఇప్పటికీ అగమ్యంగానే ఉంది.

కార్తీక పౌర్ణమికి అరుణాచలేశ్వరుడి దర్శనానికి టీజీఎస్ఆర్టీసీ ప్యాకేజీలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) సువార్త చెప్పింది. శివ భక్తుల కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ ప్యాకేజీలో, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునే అవకాశం … Read More

కలిసి రావడానికి కార్తీక మాసంలో చెయవలసిన కార్యాలు

ఏడాది పొడవునా ఎన్నో శుభ మాసాలు వస్తూ పోతాయి. కానీ, కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. శాస్త్ర పండితుల ప్రకారం, కార్తీక మాసం దైవభక్తులకు నిజమైన వరప్రసాదం. ఈ మాసంలో చల్లటి నీటిలో స్నానం చేయడం, దానం చేయడం, జపాలు … Read More