సజ్జల భార్గవ్ రెడ్డిపై గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు వైసీపీ కార్యకర్త ఖాజాబాబాను అరెస్ట్ చేశారు. విచారణలో ఖాజాబాబా భార్గవ్ రెడ్డి ఆదేశాల మేరకు పోస్టులు పెట్టానని చెప్పడంతో భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వినోద్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, పులివెందులలో పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తూ, వైసీపీ సైకో ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపుతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, ఫేక్ ఐడీలను గుర్తించి పట్టుకునేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.