ఢిల్లీ ఛలో: రైతుల నిరసన తీవ్రత
వివిధ రైతు సంఘాల పిలుపు మేరకు, తమ డిమాండ్ల కోసం రైతులు ఢిల్లీ వైపు పెద్ద ఎత్తున మార్చ్ చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, భూసేకరణకు సంబంధించిన పరిహారం, రుణమాఫీ, పెన్షన్లు వంటి అనేక డిమాండ్లతో రైతులు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు. దీనితో ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైతుల నిరసనలు తీవ్రమై ఉద్రిక్తతలు నెలకొన్నాయి.