హైదరాబాద్ జంట జలాశయాల రక్షణ బాధ్యత హైడ్రాకు
గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాల పరిరక్షణ బాధ్యతను నిర్వహిస్తున్న ‘హైడ్రా’ ఇప్పుడు హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ల పరిరక్షణ బాధ్యతను కూడా చేపట్టింది. వారసత్వ కట్టడాలుగా ఈ జంట జలాశయాల పరిరక్షణ, వాటి పరీవాహక ప్రాంతాలను కాపాడటం, ఫాంహౌస్‌లు మరియు అక్రమ నిర్మాణాల కూల్చివేత హైడ్రా పరిధిలోకి వచ్చాయి.