భార్య, అన్నతో సంబంధం, భర్త ఆత్మహత్య!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ధోల్కాలోని 35 ఏళ్ల వ్యక్తి తన భార్య తన అన్న లైంగిక సంబంధం కలిగి ఉన్నారని తెలుసుకుని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
నవంబర్ 7న జరిగిన ఈ ఘటనలో, మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. కుమారుడి జేబులో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా తండ్రి ఫిర్యాదు చేశాడు.
సూసైడ్ నోట్‌లోని వివరాల ప్రకారం, మృతుడు 2009లో ధోల్కాకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వీరు 2017లో చట్టబద్ధంగా విడిపోయారు. 2023 ఫిబ్రవరిలో అతడు మరొక మహిళను వివాహం చేసుకుని ధోల్కాలో నివాసం ఉంటున్నాడు. కానీ, తన భార్య తన అన్నతో లైంగిక సంబంధం కలిగి ఉన్నారని మూడు నెలల క్రితం తెలుసుకున్నాడు.
ఓ రోజు ఇంట్లో భార్య ఆమె అన్నతో ఏకాంతంగా ఉన్నప్పుడు చూసి నిలదీశాడు. దీనికి ప్రతిస్పందనగా ఆమె తన అన్నతో కలిసి దాడి చేసి బెదిరించింది. తన భార్య గతంలో నలుగురు వ్యక్తులను వివాహం చేసుకుందని కూడా అతనికి తెలిసింది.
తీవ్ర మనస్థాపానికి గురైన అతడు విషం తాగి నవంబర్ 7న మరణించాడు. మృతుడి తండ్రి ఆస్పత్రికి వచ్చి చూడగా, అతని జేబులో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి భార్య, అన్న, మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.