ప్రైవేట్ బస్సులో దొంగతనం
ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగులోంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని దొంగలు దొంగిలించారు.
ఏపీలోని మండపేట నుంచి హైదరాబాద్‌కు బస్సులో వస్తున్న ఆ మహిళ, సూర్యాపేట జిల్లాలోని నార్కట్‌పల్లి వద్ద తన బ్యాగులో బంగారం లేదని గుర్తించింది. దీంతో ఆమె బస్సు డ్రైవర్‌ను హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లమని కోరింది.
పోలీసులు బస్సులోని ప్రయాణికులను విచారించి, అదే బస్సులో హైదరాబాద్‌కు పంపారు. బాధితురాలితో కలిసి పోలీసులు బస్సు ఆగిన ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేశారు.