హైదరాబాద్‌లో అతిపెద్ద రైల్వేస్టేషన్: చర్లపల్లి రైల్వే స్టేషన్‌

హైదరాబాద్‌ నగరం చాలా కాలంగా కోరుకుంటున్న ఒక పెద్ద మార్పు ఇప్పుడు జరగబోతోంది. చర్లపల్లిలో నిర్మించబడిన అత్యధునిక రైల్వే స్టేషన్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత నగరంలో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా ఈ స్టేషన్‌ అవతరిస్తోంది.

సీకింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో రద్దీ పెరుగుదల దృష్ట్యా, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ కొత్త స్టేషన్‌ను అభివృద్ధి చేసింది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో, విమానాశ్రయం మాదిరిగానే సకల హంగులతో రెండు అంతస్తుల్లో ఈ స్టేషన్‌ నిర్మించబడింది.

ఈ రైల్వే స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, 2 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 5 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి, అదనంగా మరో నాలుగు ప్లాట్‌ఫామ్‌లను కూడా నిర్మించారు. చిన్న చిన్న పనులు మినహా, స్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తయింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నారని సమాచారం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌ ఇప్పటికే ఈ స్టేషన్‌ను పరిశీలించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను చేరుకునేందుకు ప్రభుత్వం రోడ్ల విస్తరణ పనులు కూడా చేపట్టింది.

ప్రస్తుతం ఆరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి మరియు మరిన్ని రైళ్లు ఆపేందుకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు లభించాయి. దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉంది. ఈ స్టేషన్‌ నుంచి ఏ ఏ రైళ్లు నడుపుతారనే వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించకపోయినా, నెట్టింట రైళ్ల జాబితా చక్కర్లు కొడుతోంది.

చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు:  12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌, 12604 హైదరాబాద్ – ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, 18045 షాలిమార్‌ – హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌, 18046 హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌, 12589/12590 గోరఖ్‌పూర్‌ – సికింద్రాబాద్‌ – గోరఖ్ పూర్.

చర్లపల్లి స్టేషన్‌లో ఆగే రైళ్లు: 12713/123714 విజయవాడ – సికింద్రాబాద్‌ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌, 12705/12706 గుంటూరు – సికింద్రాబాద్‌ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, 12757/12758 సికింద్రాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌, 17233/17234 సికింద్రాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ – సికింద్రాబాద్ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌, 17011/17012 హైదరాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌, 17201/17202 గుంటూరు – సికింద్రాబాద్‌ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *