మహానగరంలో మాయలేడి : ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తూ లక్షలతో పరుగుపెట్టిన మహిళ
హైదరాబాద్‌లో కొండాపూర్‌కు చెందిన బత్తిన రూప్ కుమార్, మరియు కొంతమంది అమాయకులు గత ఐదు సంవత్సరాలుగా దారుణమైన మనస్తాపానికి గురవుతున్నారు. 2019లో శ్రీదేవి అనే మహిళ వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్ లో రూప్ కుమార్ నివసిస్తున్న కాలనీ వ్యక్తుల ద్వారా ‘పెట్టుబడి వ్యాపారం’ గురించి పరిచయం చేయించింది. మొదట్లో తక్కువ ధరకు బైకులు, ఏసీ వంటి వస్తువులను ఇచ్చి నమ్మకాన్ని పెంచిన ఆమె, తరువాత ‘తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం’ అంటూ మోసాలు ప్రారంభించింది. ఆమె మాటలు నమ్మిన రూప్ కుమార్ దాదాపు 15 లక్షల రూపాయలు ఆమె చూపిన ఫ్లాట్ కు పెట్టుబడిగా ఇచ్చారు.
అందరికీ తక్కువ ధరకు ఫ్లాట్లు ఇప్పిస్తానని ఆశ చూపించి ఖైరతాబాద్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా ఇలాగే మోసాలు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2019 నుండి ఆమె పెట్టుబడిదారులకు సమాధానం చెప్పటం మానేశారు. అప్పటినుంచి ఆమె బూటకపు వాగ్దానాలు చేయడం, గట్టిగా అడిగిన వారికి చెల్లని బ్యాంకు చెక్‌లు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఇప్పటికీ శ్రీదేవి, ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు కలిసి ఈ మోసాలు కొనసాగిస్తున్నారు. ఈ మోసానికి బలైన బత్తిన రూప్ కుమార్ మరియు ఇంకొంతమంది భాదితులు వరంగల్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ కు ఫిర్యాదులు అందించారు.
శ్రీదేవి లాంటి మాయ లేడి సమాజం లో మరెన్నో అక్రమాలకు పాల్పడకుండా అలాగే మరెన్నో అమాయక జీవితాలను నాశనం చేయకముందే పోలీసులు ఆమెపై తక్షణం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.