జత్వాని కేసు: హైకోర్టులో కీలక విచారణలు, విద్యాసాగర్ కస్టడీ పిటిషన్‌పై సీఐడీ కోర్టులో విచారణ
ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో హైకోర్టులో కీలక విచారణలు నేడు జరగనున్నాయి. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరానా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. గతంలో హైకోర్టు ఈ కేసులో తొందరపాటు చర్యలను నివారించింది.
మరోవైపు, జత్వాని కేసులో A1 నిందితుడిగా ఉన్న విద్యాసాగర్ కస్టడీ పిటిషన్ పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు విద్యాసాగర్ ను వారం రోజులు తమ కస్టడీలో ఉంచాలని కోరుతున్నారు.
జత్వానీ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తునకు పూనుకున్న పోలీసులు, విద్యాసాగర్ ను తమ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమయ్యారు. దీని కోసం సీఐడీ కోర్టును ఆశ్రయించారు. పోలీసుల పిటిషన్‌పై ఈ రోజు సీఐడీ కోర్టులో విచారణ జరుగుతుంది.