కైలాస పర్వతం: మానవాళికి అందుబాటులో లేని శిఖరం

వేల ఏండ్ల కాలంగా, హిమాలయ శ్రేణుల మధ్య నిలిచిన కైలాస పర్వతం అనేక రహస్యాలను తనలో దాచుకుని ఉంది. హిందువులు దీనిని పరమ పవిత్రమైన స్థలంగా భావిస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడే కొలువై ఉన్నారని వారి విశ్వాసం. కానీ, ఈ శిఖరం ఎంతో ప్రసిద్ధమైన ఎవరెస్ట్ కన్నా 2000 మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ, మానవులు ఎవ్వరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు.

సనాతన ధర్మంలో, కైలాస పర్వతం శివుని నివాసం. శివుడు ఇక్కడ యోగ సాధనలో నిమగ్నమై ఉంటారని, గణేశుడు, కార్తికేయుడు కూడా ఇక్కడ నివసిస్తుంటారని నమ్ముతారు. ఈ పర్వతం చుట్టూ విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. ప్రదక్షిణలు చేసేందుకు వెళ్ళిన భక్తులు కైలాస పర్వతం దగ్గరకు రాగానే, ఓ వింత శబ్దం వెలువడుతుందని, అది ఓం అని వినిపిస్తుందని చెప్పారు.

కైలాస పర్వతంపైకి ఎక్కేందుకు ప్రయత్నించిన వారందరూ వైఫల్యం చెందారు. వారికి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. 1999 లో రష్యా శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వతం గురించి పరిశోధనలు చేసింది. వారు నెల రోజుల పాటు పర్వతం కింద ఉండి పరిశీలించారు. దాని ఫలితంగా, కైలాస పర్వతం సహజంగా ఏర్పడలేదని, అది ఒక పిరమిడ్ రూపంలో ఉండి మందపాటి మంచుతో కప్పబడి ఉందని వారు కనుగొన్నారు. దీనికి వారు “శివ పిరమిడ్” అని పేరు పెట్టారు.

2007 లో ఒక రష్యన్ పర్వతారోహకుడు సెర్గీ సిస్టికోవ్ తన బృందంతో కలిసి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. కానీ, వారు ఎత్తుకు చేరుకున్న తర్వాత వారికి తీవ్రమైన నొప్పి, అవయవాల అచేతనం, భయంకరమైన అనుభవం ఎదురైంది. వారు వెంటనే దిగి వచ్చారు.

బ్రిటీష్ పర్వతారోహకుడు కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. కానీ పర్వతంపై దట్టమైన మంచు, అకస్మాత్తుగా హిమపాతాలు, అదృశ్యమైన శక్తి వంటి అడ్డంకులను ఎదుర్కొని, అతను తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

కైలాస పర్వతం రహస్యాలను ఛేదించడానికి చైనా చాలా మంది పర్వతారోహకులను పంపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, బౌద్ధులు, జైనులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో, చైనా ప్రభుత్వం తన ప్రణాళికను విరమించుకోవాల్సి వచ్చింది.

ఈ రహస్య శిఖరాన్ని ఎక్కేందుకు ప్రయత్నించే వారికి తలపై వెంట్రుకలు, గోర్లు వేగంగా పెరుగుతాయని, వయసు వేగంగా రావడం మొదలవుతుందని, ముఖంలో వృద్ధాప్యం కనిపించడం ప్రారంభమవుతుందని చెప్పబడుతుంది. ఏదో అదృశ్య శక్తి వారిని భ్రాంతికి గురి చేస్తుంది.

కైలాస పర్వతం చుట్టూ నిలువు రాళ్లు, మంచుకొండలు ఉన్నాయి. పర్వతం వాలు 65 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. ఈ అడ్డంకుల కారణంగా పైకి ఎక్కడం అసాధ్యంగా కనిపిస్తుంది.

కైలాస పర్వతం మానవాళికి అందుబాటులో లేని శిఖరం. దాని అసలు రహస్యం ఇప్పటికీ అగమ్యంగానే ఉంది. దానిని చూసేవాళ్ళు, దాని గురించి వినేవాళ్ళు దానిలో దైవత్వాన్ని చూస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *