కేఎల్ రాహుల్: లక్నో సూపర్ జెయింట్స్‌తో విడిపోవడానికి కారణం ఏమిటి?

2025 IPL మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఈ మెగా వేలం ముందు ప్రాంఛైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫ్రాంఛైజీ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బయటికొచ్చాడు.

రాహుల్‌ను రిటైన్ చేసుకోవడానికి LSG ఆసక్తి చూపినప్పటికీ, అతడు దానికి నిరాకరించాడు. గత సీజన్‌లో LSG యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాహుల్‌ ఆ ఫ్రాంఛైజీకి దూరం కావాలని నిర్ణయించుకున్నాడట.

ఇటీవల స్టార్‌స్పోర్ట్స్‌కు కేఎల్ రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా, LSGని వీడటానికి గల కారణాలను అతడు వెల్లడించాడు. “నా ప్రయాణంను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నాను, నాదైన ఆట ఆడేందుకు స్వేచ్ఛ అవసరం. LSG నుంచి బయటికొచ్చాను,” అని రాహుల్ చెప్పాడు.

IPL మెగా వేలంలో కేఎల్ రాహుల్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండటం, వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్ కావడంతో ఫ్రాంఛైజీలు రాహుల్‌ కోసం తీవ్రంగా పోటీపడే అవకాశముంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాహుల్‌ కోసం భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమైందట. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *