శివకటాక్షానికి వేదిక: కోటి దీపోత్సవం
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం శివతత్త్వం తో నిండిపోయింది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో జరుగుతున్న “కోటి దీపోత్సవం” లో భక్తుల ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే రెండు రోజులు పూర్తి అయ్యాయి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
నేడు కోటి దీపోత్సవం మూడవ రోజు, కార్తిక సోమవారం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
కోటి దీపోత్సవంలో పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ (వైశ్య గురు మఠము హలదీపూర్ మరియు వారణాసి), శ్రీ శివానంద భారతి స్వామీజీ (కర్ణాటక హోస్పేట చింతామణి మఠం) గారిచే అనుగ్రహ భాషణం జరుగుతుంది. శ్రీ బంగారయ్య శర్మ గారు ప్రవచనామృతం చేయనున్నారు.
వేదికపై శివపరివారానికి కోటి బిల్వార్చన, భక్తులచే శివలింగాలకు కోటి బిల్వార్చన, కోటి దీపోత్సవం వేదికపై జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ ఉంటుంది.
కోటి బిల్వార్చన.. లింగోద్బవం, సప్తహారతులు, మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికైన కోటి దీపోత్సవానికి సాదరంగా స్వాగతం పలుకుతోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. అందరూ పాల్గొనండి… పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులుకండి.