నాని కెరీర్‌లో అతి పెద్ద సినిమా: “ది ప్యారడైజ్”
నేచురల్ స్టార్ నాని హిట్స్‌తో కెరీర్‌లో దూసుకుపోతున్నారు. “దసరా”, “హాయ్ నాన్న” వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత, నాని వరుసగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయడానికి నాని అంగీకరించారు. ఈ సినిమా నాని కెరీర్‌లోనే అతి పెద్ద బడ్జెట్‌తో తయారవుతోంది.
సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. “ది ప్యారడైజ్” (THE PARADISE) అనే టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కాబోతుంది. 80వ దశకం సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని తెలుస్తోంది. నాని ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం.
“నిజమైన నాయకుడికి ఐడెంటిటీ అవసరం లేదన్న” స్లోగన్‌తో పోస్టర్‌ను డిజైన్ చేశారు మేకర్స్. స్లోగన్‌కు తగ్గట్టుగా చిత్రంలో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం నాని స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న “హిట్ 3” చిత్ర షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది.