పామాయిల్ రైతులకు పుష్కలంగా లాభాలు: ఏపీ ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో పామాయిల్ రైతులకు స్థిరమైన ధరలు లభించేలా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, పామాయిల్ రైతులు, కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్‌ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరణపై చర్చించారు.
“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పామాయిల్ రైతులకు ఊరట లభించింది” అని అచ్చెన్నాయుడు అన్నారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలకే టన్ను ధర రూ.12,500 నుంచి ఏకంగా రూ.19,000కి పెరిగింది.” గత ప్రభుత్వం పాలనలో ఒక సందర్భంలో టన్నుకు రూ.23 వేల అత్యధిక ధర పెరగడంతో చాలామంది కౌలు రైతులు ఇదే ధర కొనసాగుతుందని ఆశపడ్డారు. ముందుగానే ఎకరానికి రూ.లక్ష అడ్వాన్సులు ఇచ్చి కౌలుకు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ధర రూ. 12 వేలకు తగ్గింది.. దీంతో రైతులు నష్టపోయారు.
“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర పెరిగింది” అని రైతులు చెబుతున్నారు. “కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల సమయంలో రూ.12,500 నుంచి రూ.19,000కి పెరిగింది. త్వరలో పామాయిల్ ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. తమకు గిట్టుబాటు ధరే దక్కుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడులను చూస్తే టన్నుకు రూ.18 వేలు లేకపోతే గిట్టుబాటు కాదంటున్నారు రైతులు. అయితే రూ. 19,000 ధర పలకడం ఆనందంగా ఉందంటున్నారు.
అధికారులు పామాయిల్ సాగును విస్తరించాలని సూచిస్తున్నారు. కేంద్రం కూడా పామాయిల్ రైతులకు తీపికబురు చెప్పింది. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి 27.5శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. దిగుమతి సుంకం పెంపు వలన పామాయిల్ పండించే రైతులకు లబ్ధి చేకూరుతుంది. మొత్తం మీద ఏపీలో పామాయిల్ రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించింది.. మద్దతు ధర పలుకుతోంది.