పుష్ప-2: అమెరికాలో రికార్డు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప: ది రూల్’ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. మేకర్స్ మరో ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఓవర్సీస్‌లో పుష్ప-2 క్రేజ్ అద్భుతంగా ఉంది. నెల రోజుల ముందు బుకింగ్స్ ప్రారంభించగా, నార్త్ అమెరికాలోనే 2.8 మిలియన్ డాలర్లకు పైగా బుకింగ్స్ జరిగాయి. 74,000 టికెట్లు అమ్ముడై రికార్డు సృష్టించింది. రిలీజ్ నాటికి 4 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంటుందని అంచనా. ప్రత్యంగిర సినిమాస్, AA సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. ఓషియానియాలో 700$ కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈరోజు హైదరాబాద్‌లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇండియాలోనూ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *