రఘురామ కృష్ణంరాజుకు చంద్రబాబు శుభాకాంక్షలు: ‘RRR’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు ఎన్నికైన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. “సినిమా రంగంలో ‘RRR’ ఎంత సంచలనం సృష్టించిందో, రాజకీయాల్లో రఘురామ కూడా అంతే సంచలనం స్రుష్టించారు” అని చంద్రబాబు నాయుడు అన్నారు. రఘురామ తండ్రి ఎమ్మెల్సీగా సేవలు అందించారని గుర్తుచేస్తూ, “కుండ బద్దలకొట్టినట్టు మాట్లాడతారు” అని రఘురామ గురించి చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో రఘురామపై అన్యాయంగా కుట్రలు, రాజద్రోహం కేసులు నమోదు చేయబడ్డాయని, పుట్టినరోజున అరెస్టు చేసి హింసించిన సంఘటన చాలా బాధాకరమని చంద్రబాబు గుర్తుచేశారు. “నేను జైల్లో ఎలా ఉన్నానో చూడడానికి సీసీ కెమెరాలు పెట్టినట్టు, రఘురామను కొడుతూ చూడటానికి కెమెరాలు పెట్టి చూశారు” అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

“వైసీపీ హయాంలో అటెంప్టివ్ రేప్ కేసు మోపబడిన ఆయన స్పీకర్, చంపేయాలని చూసిన ఆయన ఇవాళ డిప్యూటీ స్పీకర్” అని చంద్రబాబు అన్నారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పహారా కాస్తున్నాం.. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి.. పాశవికంగా తయారయ్యారు.. వాళ్ళంతా” అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. “నిజ జీవితంలో దెబ్బ పడ్డారు.. తట్టుకుని నిలబడ్డారు.. దానికి మీకు హాట్సాఫ్” అంటూ రఘురామకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *