మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి రోడ్‌షో
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ముంబైలోని వర్లీలో శివసేన (UBT) అభ్యర్థి ఆదిత్య ఠాక్రేకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న రేవంత్‌కు దారి పొడవునా ప్రజల నుంచి అభిమానంతో కూడిన స్వాగతం లభించింది.
మహారాష్ట్ర ప్రజలు రేవంత్‌కు ఫ్లెక్సీలతో ఘనంగా స్వాగతం పలికారు. రోడ్‌షోకు ముందు, రేవంత్ ముంబైలోని తిరుపతి బాలాజీ ఆలయంలో పూజలు చేశారు. ఈ రోడ్‌షోలో ఆదిత్య ఠాక్రే, ముంబై నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్ష గైక్వాడ్ కూడా పాల్గొన్నారు.