రష్యా – భారత్ సంబంధాలు: ఒక అద్భుతమైన అధ్యాయం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారతదేశాన్ని తన దేశానికి సహజ భాగస్వామిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు అన్ని రంగాలలోనూ అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాయని, వాణిజ్యం, రక్షణ, సాంస్కృతిక రంగాలలో ఘనమైన పురోగతిని సాధించాయని పేర్కొన్నారు.
వ్లాదిమిర్ పుతిన్, భారత్‌ను ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, అద్భుతమైన సంస్కృతి కలిగిన దేశంగా ప్రశంసించారు. భారతదేశం ఏటా 7.4 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని, రెండు దేశాల ఆర్థిక పరిస్తితి దేశాల మధ్య సంబంధాలపై ఆధారపడి వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
భద్రత, రక్షణ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం కానుందని, వాణిజ్యం ఏటా 60 బిలియన్ డాలర్లకు చేరుకుందని పుతిన్ తెలిపారు. రష్యా – భారత్ మధ్య విశ్వాసాన్ని, భవిష్యత్తులో భాగస్వామ్యాన్ని బలపరుస్తూ, బ్రహ్మోస్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి కరెన్సీని సృష్టించే ఆలోచన లేదని వెల్లడించారు.
భారతదేశ స్వాతంత్ర్యం సాధించడంలో సోవియెట్ యూనియన్ పాత్రను పుతిన్ గుర్తుచేసుకున్నారు. ఇటీవల రష్యాలోని కజన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సందర్భంగా, భారత ఆర్థిక వృద్ధిని ప్రశంసించారు.