హైదరాబాద్ లో నటి ఆత్మహత్య: కొత్త కోణాలు
హైదరాబాద్‌లో కన్నడ సీరియల్ నటి శోభిత శివన్న ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబం చేసిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభమైంది. ప్రాథమిక దర్యాప్తులో భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని తేలింది. ఆమె మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. శోభిత భర్త సుధీర్‌రెడ్డితో పాటు, ఇంటి చుట్టుపక్కల వారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్‌లో “ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్.. చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్” అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. బెంగుళూరు మ్యాట్రిమోని సైట్ ద్వారా సుధీర్ శోభితను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత శోభిత సీరియళ్లలో నటించడం ఆపేసింది. శోభిత చివరిసారి ఎవరితో మాట్లాడిందనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబం మృతదేహాన్ని బెంగళూరుకు తరలించింది.