సిద్దిపేట ఏసీపీ డ్రంక్ డ్రైవ్ వివాదం!
సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్.. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ఆయన వాహనం ఆపి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయమని పోలీసులు చెప్పగా, “నేను తాగలేదు.. ఎందుకు చేయాలి?” అని తిరగబడ్డారు. తనని తాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవాడిగా చెప్పుకుంటూ.. పోలీసులపైనే మండిపడ్డారు. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు అంగీకరించకపోగా, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.