సర్వేపల్లి గిరిజనులకు ఎమ్మెల్యే హామీ: దుర్భర జీవితాల్లో వెలుగు నింపుతాం!
సర్వేపల్లి నియోజకవర్గంలోని గిరిజనుల దుర్భర జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు, గిరిజనుల కోసం ప్రత్యేక పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు.
“సర్వేపల్లిలో 39,000 మంది గిరిజనులు ఉన్నారు. వారిలో చాలా మందికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. దాదాపు 90 శాతం మంది నిరక్షరాస్యులు. పింఛన్ సమస్యలు కూడా ఉన్నాయి. వారి సమస్యలను పరిష్కరించేందుకే ఈ వేదికను ఏర్పాటు చేశాము.” అని ఎమ్మెల్యే తెలిపారు.
“జిల్లా అధికారులు గిరిజనుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదు. గత ప్రభుత్వం గిరిజనులకు దక్కిన కేంద్ర పథకాలను ఆపేసింది. వాటిని తిరిగి సర్వేపల్లి గిరిజనులకు అందజేస్తాము. గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన గిరిపుత్రులను మేము ఆదుకుంటాము.” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
“ప్రతి అధికారి గిరిజనుల విషయంలో నిర్లక్ష్యం వహించరాదు. స్థానికులకు రుణాలు మంజూరు చేస్తాము. పాఠశాలలను అభివృద్ధి చేస్తాము.” అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.