వయసు తేడా? సినిమాల్లో అది కేవలం ఒక సంఖ్య మాత్రమే!
ఒకప్పుడు హీరో కన్నా హీరోయిన్ వయసు చిన్నగా ఉండాలన్నది ఒక పెద్ద నియమం. కానీ ఇప్పుడు కాలం మారింది. పాత కట్టుబాట్లను పక్కన పెట్టి, నేటి హీరోయిన్లు తమకన్నా చిన్న వయసున్న హీరోలతో జత కడుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది బ్యూటీలు తమకన్నా చిన్నవాళ్లతో జోడీ కట్టారు. ఆ జాబితాలో తొలి వరుసలో ఉంది త్రిష. 40 ఏళ్లు పైబడిన త్రిష ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ, తనకన్నా చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్‌తో దమ్ములో నటించింది.
15 ఏళ్ళుగా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత కూడా తనకన్నా చిన్నవాడైన విజయ్ దేవరకొండతో ఖుషీలో రొమాన్స్ చేసింది. నాగశౌర్యతో ఓ బేబీ, బెల్లకొండ శ్రీనివాస్‌తో అల్లుడు శ్రీనులో యాక్ట్ చేసింది. యశోదలో ఉన్నిముకుందన్, శాకుంతలంలో దేవ్ మోహన్ కూడా ఆమెకన్నా చిన్నవాళ్లే.
మరో హీరోయిన్ అనుష్క కూడా తన కన్నా చిన్న వయసున్న హీరోలతో నటించింది. రానాతో రుద్రమదేవి, బాహుబలి, నవీన్‌తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, ఉన్నిముకుందన్‌తో భాగమతిలో కనిపించింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా రామ్ పోతినేనితో గణేష్, బెల్లకొండ శ్రీనివాస్‌తో కవచం, సీతలో నటించింది.
రకుల్ ప్రీత్ సింగ్ కొండపొలంలో వైష్ణవ్ తేజ్‌తో జోడీ కట్టింది. పూజా హెగ్డే కూడా బెల్లంకొండతో సాక్ష్యంలో నటించింది. శ్రద్దా శ్రీనాథ్ సిద్దు జొన్నలగడ్డతో కృష్ణ అండ్ హిజ్ లీలాలో నటించింది. ఇప్పుడు విశ్వక్ సేన్‌తో మెకానిక్ రాఖీలో జతకడుతోంది.
లాస్ట్ బట్ నాది లీస్ట్.. నయనతార కూడా తనకన్నా వయసులో తక్కువ అయిన కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తోంది. టాక్సిక్ మూవీలో యష్, కవిన్‌తో మరో మూవీకి ఓకే చెప్పింది. హీరోలు కూడా తమ కన్నా పెద్ద వాళ్లతో యాక్ట్ చేసేందుకు ఏ మాత్రం అడ్డు చెప్పకపోవడంతో ఈ జంటలు బిగ్ స్క్రీన్ పై ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ జంటలను ఆదరిస్తున్నారు.