రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల ఆగ్రహం: ఫ్లైట్ రద్దుతో అల్లకల్లోలం!
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యానికి నిరసనగా ఊగిపోతున్నారు. హైదరాబాద్‌కు ఉదయం 8.15 గంటలకు వెళ్ళవలసిన ఫ్లైట్‌ను ఇండిగో ఎయిర్‌లైన్స్ అకస్మాత్తుగా రద్దు చేసింది. ముందస్తు సమాచారం లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనంతో నిరసన తెలుపుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని నిలదీస్తున్నారు. ఉదయం నుంచి వేచి చూస్తున్న ప్రయాణికులు అసహనంతో ఆందోళనకు దిగారు. ఎయిర్‌లైన్స్ మేనేజర్ మరియు సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.