డిప్యూటీ స్పీకర్‌గా ‘ట్రిపుల్ ఆర్’ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. సభాపతి స్థానంలో ఆయనను చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూర్చోబెట్టారు.

సీఎం చంద్రబాబు నాయుడు ట్రిపుల్ ఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. “చిత్ర పరిశ్రమలో ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో.. రాజకీయంగా మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించింది” అని చెప్పారు. టీడీపీ తరఫున, వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు. “నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో.. ట్రిపుల్ ఆర్ రచ్చబండ అంత పాపులర్ అయ్యిందని” గుర్తు చేశారు.

“జీవితంలో కొన్ని సమయాల్లో కొన్ని సమస్యలు వస్తాయని.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యమని” చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. “స్పీకర్ కుర్చీకి మీరు నిండుదనం తెచ్చారంటూ ట్రిపుల్ ఆర్కు కితాబు ఇచ్చారు.” తెలుగువారి సొంతమైన పంచ కట్టుతో తెలుగు బిడ్డలా సభకు వచ్చారని చంద్రబాబు నాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. “కొత్త బాధ్యతలతో రఘురామను చూసినప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు.”

అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్.. డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్కు అభినందనలు తెలిపారు. సభలోని ఎంఎల్ఏలంతా వెళ్లి.. రఘురామ రాజుకు అభినందనలు చెప్పారు. అదే సమయంలో రఘురామ రాజుతో పలువురు మంత్రులు, ఎంఎల్ఏలు ఫోటోలు దిగారు.

ట్రిపుల్ ఆర్ ను సభాపతి స్థానంలోకి వచ్చి ఆసీనులై.. డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. దీంతో ఆయన డిప్యూటీ స్పీకర్గా ప్రమాణం చేసి.. స్పీకర్ సీట్లో ఆసీనులయ్యారు.

“ట్రిపుల్ ఆర్ను పరిచయం చేయాల్సిన అవసరం లేని నాయకుడని” స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశంసించారు. “గతంలో వైసీపీ ప్రభుత్వంపై రచ్చబండ పేరుతో నిర్వహించి కార్యక్రమం దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని” గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *